విజయవాడ : సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యులు ఐజేయూ నాయకుడు
కామ్రేడ్ దేవేంద్ర చింతన్ (86) సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో మృతి చెందారు. గత
కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చింతన్ మృతి చెందడం ఎంతో
బాధాకరమని ఆయన మృతి ఐజేయూకి తీరని లోటని ఆయన మృతిపట్ల ఐజేయూ అధ్యక్షులు కే
శ్రీనివాస రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వేందర్ సింగ్ జమ్ము, ఉపాధ్యక్షులు అంబటి
ఆంజనేయులు, ఐజేయూ కౌన్సిల్ మెంబర్స్ ఎస్కే బాబు, కె. సాంబశివరావు ఒక ప్రకటనలో
సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు. ఆయన
కోరిక మేరకు కుటుంబసభ్యులు తన మృత దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించారు.
జమ్ములో జన్మించిన దేవేంద్ర చింతన్ ఆర్ ఎస్ఎస్ మరియు లెఫ్టిస్ట్ భావజాలంతో
ట్రేడ్ యూనియన్ నాయకునిగా పనిచేశారు. అంతేకాకుండా ఐజేయూ నడిపే సబ్‌స్రైబ్
న్యూస్ మ్యాగజైన్ లో ఎడిటోరియల్ బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నారు. పేద ప్రజల
ఆకాంక్షల మేరకు నిబద్ధతతో కూడిన జర్నలిస్టుగా పని చేశారని ఈ సందర్భంగా
ప్రకటనలో పేర్కొన్నారు.
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ సంతాపం
ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యులు ఐజేయూ నాయకుడు కామ్రేడ్ దేవేంద్ర చింతన్ (86)
మృతి పట్ల ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.
సంతాపం తెలియజేసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ అధ్యక్ష,
కార్యదర్శులు చావారవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్ అధ్యక్షులు నిమ్మరాజు
చలపతిరావు, కార్యదర్శి ఆర్ వసంత్, ఏపీయూడబ్ల్యూజే కౌన్సిల్ మెంబర్లు దారం
వెంకటేశ్వరరావు, జి రామారావు, దాసరి నాగరాజు ఉన్నారు.