శ్రీకాకుళం : జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన రణస్థలంలో జరగనున్న యువశక్తి సభ ఏర్పాట్లను పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం రాత్రి పరిశీలించారు. సభాస్థలి విషయంలో కొన్ని సూచనలను పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కోఆర్డినేటర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, ఇతర బాధ్యులకు ఇచ్చారు. మహిళకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, లైటింగ్ సదుపాయం, సౌండ్ సిస్టం, భోజనాల ఏర్పాట్లు ఇతరత్రా అంశాలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు.
జనసేనలో కొనసాగుతున్న చేరికలు : జనసేన పార్టీలోకి నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రలోని గాజువాక, నెలిమర్ల, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన మేరకు పని చేయాలని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో షేక్ ఫజులాల్ రెహమాన్, షేక్ ముజిబ్ రెహమాన్, అతుల్ రెహమాన్, ఎం.డి.షఫీ, షేక్ సలీం, కొల్లి కనక, జగదీష్, పి.శంకర్, బాడి పైడి రాజు, రాము తదితరులు ఉన్నారు.