పవన్ చంద్రబాబు లను ఒక దగ్గర చూసి ప్రజలు సంతోషిస్తున్నారు
విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో యువశక్తి ప్రచార కార్యక్రమం మూడవ రోజున 37 వ డివిజన్ అధ్యక్షులు శిగినంశెట్టి రాము గుప్తా ఆధ్వర్యంలో రమణయ్య కూల్ డ్రింక్ షాప్ వద్ద నుంచి బయలుదేరి మెయిన్ బజార్ మోడరన్ కేఫ్ విజయ బ్యాకరి వరకు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన వెంకట మహేష్ పాల్గొని ప్రతి షాప్ కు వెళ్లి కరపత్రాలను అందజేస్తూ వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారస్తులు మహేష్ తో జగన్మోహన్ రెడ్డి పాలన సరిగా లేదని, కొన్ని రోజులు అసలు బోణి కూడా కావడం లేదని, పండగ వస్తే ఆనందం పోయి బాధ కలుగుతుందని, జగన్ పాలన ఎప్పుడు పోతుందా అని దేవుడికి దండం పెట్టుకుంటున్నామని, జగన్ పాలనలో ఇక్కడ వ్యాపారం చేయడం కన్నా ఒరిస్సా వెళ్లి మరమరాలు అమ్ముకుంటే బాగుంటుందనిపిస్తుందని, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తవ్వా మారుతి, కొండేటి దేవానంద్, చల్ల ఏసు బాబు,కిలని రాము యాదవ్ , దుర్గ రావు , బేతాళం రవికుమార్, మదన స్టాలిన్ శంకర్, కొప్పిరెడ్డి సత్యనారాయణమూర్తి, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.