విజయవాడ : “నా సేన కోసం.. నా వంతు..” కార్యక్రమం కోసం హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన జంగా సుధీర్, జంగా విజయలక్ష్మీ దంపతులు రూ. 1 లక్ష విరాళం చెక్ రూపంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు చేతుల మీదుగా జనసేన పార్టీకి అందజేశారు. ప్రశాసన్ నగర్ జనసేన కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు తరాల కోసం చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు చాలా విలువైనదని స్పష్టం చేశారు. జనసేన పార్టీ లక్ష్యాల సాధన కోసం స్వచ్చంధంగా చేయూతను అందిస్తున్న ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలుపుతూ, జనసేనకు విరాళంగా ఇస్తున్న ప్రతీ పైసా బాధ్యతగా వినియోగిస్తామని పేర్కొన్నారు. రేపటి పౌరులకు సానుకూల వాతావరణం, సామాజిక భద్రత, రక్షణ కల్పించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ లక్ష్య సాధన కొరకు మనమంతా సాధ్యమైనంత కృషి చేయాలని కోరారు.