విజయవాడ : టీమ్ జనసేన సింగపూర్ విభాగం ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమానికి రూ.5 లక్షలు విరాళం అందచేశారు. గిరిధర్ సరాయ్ ఆధ్వర్యంలో టీమ్ జనసేన సింగపూర్ సభ్యులు సమకూర్చిన ఈ మొత్తాన్ని కోయ విష్ణుప్రియ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి చెక్కు రూపంలో అందచేశారు. సోమవారం పవన్ కళ్యాణ్ ని కలసిన ఆమె టీమ్ జనసేన సింగపూర్ విభాగం పార్టీకి మద్దతుగా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా తెలియచేశారు.