తూర్పుగోదావరి : ప్యాకేజి గురించి మాట్లాడుకుంటే నిర్మొహమాటంగా చెప్పొచ్చు అని చంద్రబాబు పవన్ కలయికపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ సెటైర్లు వేశారు. వీరి కలయిక దేనిని సూచిస్తుందో ప్రజలకు బాగా తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబును పవన్ పరామర్శించడం చూసి జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు భరత్ మాట్లాడుతూ ‘పవన్ బీజేపీతో పొత్తు ఉందంటూనే చంద్రబాబును కలుస్తారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని ఎంపీ మార్గాని కోరారు.