విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు జనసేన పవన్ కల్యాణ్ మధ్య
ముసుగు తొలగిపోయిందని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. జీ
హుజుర్ అంటూ చంద్రబాబుతో మరోసారి పవన్ భేటీ అయ్యారని, ఆదివారం పవన్ స్వయంగా
చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారని, వీరిద్దరి భేటీపై మంత్రి ఆర్కే రోజా
స్పందిస్తూ ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘విశాఖలో మంత్రులపై
జనసేన కార్యకర్తలు దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్ను పరామర్శిస్తాడు.
చంద్రబాబు సభల్లో 11 మంది చనిపోతే పవన్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తాడు.
వీళ్ల దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా!’’ అంటూ రోజా ట్వీట్ చేశారు.