విజయవాడ : చనమోలు వెంకట్రావు ప్లై ఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్న శ్రీదేవి కరుమారి
అమ్మన్ శక్తి పీఠంలో ఆదివారం పుష్ప యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత శక్తి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి
దాసు ,ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి కి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో
సత్కరించారు. పుష్య మాసం, పుష్య నక్షత్రం, అలాగే అమ్మవారి జన్మదిన వేడుకలు
ఘనంగా నిర్వహించారు. సుమారు 500 కిలోలు పలు రకాలైన పుష్పాలతో అమ్మ వారి ఉత్సవ
మూర్తికి పుష్పాభిషేకం నిర్వహించారు. వందలాది మహిళా భక్తులు ఈ వేడుకల్లో
పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ప్రదర్శించిన మహిళల కోలాటాలు భక్తులను అలరించాయి. అనంతరం ఆలయ
ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక హోమాల్లో సుమారు 30 మంది దంపతులు
పాల్గొన్నారు. హోమాలు క్రతువు అనంతరం అమ్మ వారి జన్మదిన కేక్ కట్ చేసి
భక్తులకు పంపిణీ చేశారు. అన్ని పూజలు హోమాలు ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో
వందలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి
వెలంపల్లితో పాటుగా నగర ఆర్య వైశ్య ప్రముఖులు కొండపల్లి మురళీకృష్ణ (బుజ్జి),
కొత్తపేట సి ఐ ఏ సుబ్రహ్మణ్యం, ఆలయ ప్రధాన అర్చకులు రాయప్రోలు దీక్షిత్, ఆలయ
కమిటీ సభ్యులు ఎస్ జ్ఞానేష్, యేమినేని వెంకట నాగేందర్, వెంకటేశ్వరరావు,
చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.