నంద్యాల : పట్టణ పేద ప్రజల సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్
రెడ్డి సాకారం చేసారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి
అంజాద్ బాషా పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఎస్సార్బిసి కాలనీలో
టిడ్కో గృహ సముదాయాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో కలిసి
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్
డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, స్థానిక ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి,
పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మార్క్ఫెడ్
చైర్మన్ పి పి నాగిరెడ్డి, ఎ.పి.టిడ్కో చైర్మెన్ జమ్మాన ప్రసన్న కుమార్,
జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి, టిడ్కో డైరెక్టర్ నాగేశ్వరి, 42 వార్డుల
కౌన్సిలర్లు, మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.