25 వ డివిజన్ 96 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పాలనతో పేద ప్రజలకు మేలు
చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని
ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
శనివారం 25 వ డివిజన్ 96 వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతల దేవి, అధికారులతో
కలిసి ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు, మొహిద్దీన్ రోడ్డు, దుర్గయ్య
వీధి, జలీల్ ఖాన్ వీధి, జెండా వీధి, మసీదు వీధి, చింతావారి వీధి, యాసిన్
రోడ్డు సహా పలు వీధులలో విస్తృతంగా పర్యటించి 272 ఇళ్లను సందర్శించారు. గడప
గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నియోజకవర్గంలో నిర్విరామంగా కొనసాగుతోందని
మల్లాది విష్ణు చెప్పారు. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం పొందిన ప్రతి ఇంటికి
వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ఏ గడపకు వెళ్లినా
లబ్ధిదారుల జీవితంలో వెలుగులు, వారి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని
తెలిపారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. వీధులలో
ప్యాచ్ వర్క్ లతో పాటు యూజిడి సమస్య పరిష్కారానికి కొత్త లైన్లకు ప్రణాళికలు
సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ విభాగానికి సూచించారు. అలాగే రోడ్లపై ఎక్కడా
నీరు నిలిచిపోకుండా చూడాలన్నారు. సచివాలయానికి కేటాయించిన రూ. 20 లక్షల
నిధులతో ఈ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని
తెలియజేశారు. ఒక్కో నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 2 కోట్ల
నిధులతో సెంట్రల్ ప్రజల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని
తెలిపారు.
సచివాలయ పరిధిలో రూ. 6.86 కోట్ల సంక్షేమం
నవరత్నాల పథకాల ద్వారా 96 వ వార్డు సచివాలయ పరిధిలో 6 కోట్ల 86 లక్షల 70 వేల
250 రూపాయల సంక్షేమాన్ని మూడున్నరేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు
వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 330 మందికి క్రమం
తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 214
మందికి రూ. 32.10 లక్షలు., విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా 71 మందికి రూ.
28.45 లక్షలు., చేయూత ద్వారా 139 మందికి రూ. 26.06 లక్షలు, కాపు నేస్తం ద్వారా
8 మందికి రూ. 1.35 లక్షలు., వాహనమిత్ర ద్వారా 12 మందికి రూ. 1.20 లక్షలు.,
జగనన్న తోడు ద్వారా 32 మందికి రూ. 3.20 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే
అందించినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.