విశాఖపట్నం : ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యవసాయ
విలువలతో ముడిపడిన అంశమని, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎక్కువశాతం వ్యవసాయం మీద
ఆధారపడి ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
అన్నారు. శనివారం విశాఖపట్నం లో కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఉత్తరాంధ్ర చర్చా వేదిక లో ఆయన మాట్లాడుతూ మన దేశం 70% పైగా వ్యవసాయ ఆధారిత
ప్రాంతమని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే నేను,
కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి కొన్ని ప్రణాళికలు రచించినట్లు
ఆయన పాల్గొన్న చర్చలో వివరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర
అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఉత్తరాంధ్ర నాయకులతో కలిసి పనిచేస్తూ ఉత్తరాంధ్ర
అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు.