అమరావతి : జీవో నంబర్ వన్‌పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ముందు దాన్ని
క్షుణ్ణంగా చదువుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. పదేపదే విమర్శలు
చేస్తున్న ప్రతిపక్షాలు అసలు ఆ జీవోను ఇప్పటిదాకా చదివాయా అంటూ ప్రశ్నించారు.
అందులో రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధమని ఎక్కడుందో చెప్పాలని కోరారు. ఈ మేరకు ఆయన
మాట్లాడుతూ రోడ్లపై బహిరంగ సభలు పెట్టొద్దని మాత్రమే చెప్పాం. అవసరమైతే అనుమతి
తీసుకొని బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. జోవో నంబర్ వన్ అన్ని పార్టీలకు
వర్తిస్తుంది. వైఎస్సార్, జగన్ పాదయాత్రల్లో ఎంతో జాగ్రత్త తీసుకున్నాం.
కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ప్రజల పట్ల అందరూ బాధ్యతగా
ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.