గుంటూరు : మార్చి 28,29 తేదీల్లో రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జి-20 దేశాల
వర్కింగ్ గ్రూపు సమావేశం జరగనుందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు
పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి వెల్లడించారు.ఈ
జి-20 దేశాల వర్కింగ్ గ్రూపు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం
అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు.అనంతరం మరో
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ
మార్చి 28,29 తేదీల్లో విశాఖపట్నంలో జి-20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశానికి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిధ్యమిస్తోందని తెలిపారు. ఈసమావేశంలో జి-20 దేశాలైన
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా,చైనా,ఫ్రాన్స్,జెర్మనీ, ఇండియా,
ఇండోనేషియా,ఇటలీ,జపాన్,రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా,సౌదీ అరేబియా,
దక్షిణాఫ్రికా,టర్కీ,ఇంగ్లాండు,ఆమెరికా దేశాల తోపాటు యూరోపియన్ యూనియన్ లోని
మరో 19 సభ్య దేశాలు ఈ జి-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో పాల్గోనున్నాయని
స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి వివరించారు.
ఈసమావేశానికి సుమారు 300 మంది వరకూ వివిధ దేశాల ప్రతి నిధులు,కేంద్ర,రాష్ట్ర
ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు,అధికారులు పాల్గొంటారని తెలిపారు. సుమారు 40
దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్న నేపధ్యంలో ప్రతి బృందానికి ముగ్గురు
నుండి నలుగురు ట్రాన్సులేటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం
జరుగుతుందన్నారు. ఈజి-20 వర్కింగ్ గ్రూప్ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ వినూత్న పధకాలు,కార్యక్రమాలను అనగా
గ్రామ,వార్డు సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు,డిజిటల్ లైబ్రరీలు,నాడు నేడు
కింద చేపట్టిన వివిధ వినూత్న కార్యక్రమాలు ఇతర విధానాలతో పాటు రాష్ట్రానికి
సంబంధించి ఆర్ట్స్ అండ్ కల్చర్ ను ప్రదర్శించడం(షోకేసింగ్) తోపాటు సుందర విశాఖ
నగరానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి
చేయనుందని స్పెషల్ సిఎస్.శ్రీలక్ష్మి స్పష్టం చేశారు.కోవిడ్ ప్రోటోకాల్
నిబంధనలను ఖచ్చింతగా పాటిస్తూ ఈసమావేశాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు
చేస్తున్నట్టు తెలిపారు.ఈసమావేశం నేపధ్యంలో విశాఖనగరంలోని రహదార్లన్నిటినీ సర్వాంగ సుందరంగా
తీర్దిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నారు. రెవెన్యూ
, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ ఈ జి-20
వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సందర్భంగా మన రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి,
పర్యాటక రంగాల ప్రాముఖ్యతను ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల పర్యాటక
ప్రాముఖ్యతను తెలియజేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుందని
చెప్పారు.