విశాఖపట్నం : బీజేపీ సీనియర్ నాయకులు పీవీ చలపతిరావు మృతి పార్టీకి తీరని
లోటని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, ఏపీ రాష్ట్ర బిజెపి ఇంచార్జ్
మురళీధరన్ అన్నారు. శుక్రవారం నగరానికి వచ్చిన మంత్రి ముందుగాఇటీవల
దివంగతులైన బిజెపి సీనియర్ నాయకులు పివి చలపతిరావు చిత్రపటానికి పూలమాల వేసి
నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవి చలపతిరావు కుమారుడు, బీజేపీ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పివియన్ మాధవ్, వారి కుటుంబ సభ్యులను కలిసి
ప్రగాఢ సంతాపం తెలియజేసారు. ఈ సందర్బంగా మురళీదరన్ మాట్లాడుతూ స్వర్గీయ పీవీ
చలపతిరావు వాజ్ పాయ్, అద్వానీలవంటి సీనియర్ నాయకుల సమకూలీనునిగా మెలిగి పార్టీ
అభివృద్దికి చేసిన విశేష కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రముఖ
పాత్ర వహించిన పీవి చలపతిరావు లేరనే వార్తను ప్రజలు జీర్ణించుకోలేక
పోతున్నారన్నారు. అలాగే ఆయన చేసిన సేవలు ప్రజలు గుండెలలో చిరస్ధాయిగా
నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పివియన్ మాధవ్ కు దైర్యం చెప్పారు.
మాధవ్ తండ్రి పీవీ చలపతిరావు ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని
పార్టీ కేడరుకు మురళీధరన్ పిలుపునిచ్చారు.