తాడేపల్లిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు
గ్రామంలో ఓ యువతిపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్
చైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న వాసిరెడ్డి
పద్మ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితుడు కల్యాణ్‌ను
కఠినంగా శిక్షిస్తామన్నారు. ‘ఇది ఒక ప్రేమోన్మాది దాడి. కల్యాణ్ అనే యువకుడు
ఒక పశువులా అర్ధరాత్రి ప్రవర్తించాడు. బాధిత యువతి డిగ్రీ పూర్తి చేసి
కంప్యూటర్ కోర్స్ చేస్తోంది. పవర్ కట్ చేసి మరీ దాడికి పాల్పడ్డాడు. కరెంట్
పోవడంతో ఇంటిలోని వారు బయటకు వచ్చారు. యువతితో పాటు తల్లి, చెల్లి చేతులు,
మెడపైన కత్తితో దాడి చేశాడు. వారి ట్రీట్మెంట్కు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఆ
ప్రేమోన్మాదిపై చార్జ్‌షీట్ వేసి హత్యాయత్నం కింద కేసు పెట్టి రౌడీ షీట్
తెరవాలని ఎస్పీని కోరాం. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ కేసులో
దర్యాప్తు వేగంగా జరుగుతుందని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.