విజయవాడ : సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం
కల్పించడమే లక్ష్యంగా విజయవాడలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘5వ
ఆర్గానిక్ మేళా’ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భూమి ఆర్గానిక్స్ కలసి సంయుక్తంగా
నిర్వహిస్తున్నట్లు భూమి ఆర్గానిక్స్ ఎండీ రఘురాం తెలిపారు. విజయవాడలోని సంస్థ
కార్యాలయంలో వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్గానిక్ మహోత్సవ్-2023
బ్రోచర్, సీ ఫుడ్ పెస్టివల్ పోస్టర్ ను నిర్వాహకులు విడుదల చేశారు. విజయవాడ
ఎస్ఎస్ కన్వెన్షన్లో జనవరి 6, 7, 8 తేదీల్లో ఆ మేళా జరగనుంది. ఈ సందర్భంగా
ఎండీ రఘరాం మాట్లాడుతూ 2023 ఆర్గానిక్ మహోత్సవంలో స్టార్ట్ అప్ కంపెనీలతో
మాట్లాడి రైతులకు ఉపయోగపడే టెక్నాలజీని ఉచితంగా రైతులకు అందుబాటులోకి
తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ మేళాలో మొదటిసారిగా సీ ఫుడ్ ఫెస్టివల్
నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా జనవరి 6, 7, 8 తేదీలలో సీ ఫుడ్ ఫెస్టివల్
ని అందుబాటులో ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 100 స్టాల్స్ తో ఈ
ఆర్గానిక్ మహోత్సవం ఉంటుందన్నారు. ఆర్గానిక్ మహోత్సవాన్ని గత 4 సంవత్సరాలుగా
అందరూ ఆదరించారని గుర్తుచేశారు. సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శన వాటి అమ్మకాలు,
సెమినార్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ ఆర్గానిక్ మహోత్సవంలో ఏర్పాటు చేస్తున్నామని
ఆయన తెలిపారు.