రైతులను క్షేత్రస్థాయి పరిశీలనలో భాగస్వామ్యం చేయాలి
విజయవాడ : విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ
సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ-
రి సర్వే పై పట్టాదారు పాసుపుస్తకం తయారీలో జరుగుతున్న లోపాలు రైతులకు
చేకూరినున్న నష్టాలు, కష్టాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత
వహించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్, మాజీ మంత్రివర్యులు
వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 1845
గ్రామాల్లో రీ సర్వే పూర్తి అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందని మొదటి
దశలో రైతులకు ఇచ్చిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష పథకం పాస్
పుస్తకాలు పూర్తిగా తప్పులు తడకలుగా ఉన్నాయని దీని మీద రైతు సంఘాల సమన్వయ
సమితి తరపున చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కు మేము విజ్ఞప్తి చేసిన
తప్పులను సరి చేయడానికి జారీ చేసిన జీవోలను ప్రజలకు తెలిసేలా ప్రకటించకపోగా
వాటిని రైతులకు అందజేయకపోవడం గర్హనీయం అన్నారు.
రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రం మాట్లాడుతూ రైతులకు
ఉపయోగపడేలా పాస్ పుస్తకాలను పునర్ముద్రించి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రాసెసర్‌లో
ఉన్న మాదిరిగా కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ
వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ కృష్ణాజిల్లా రంగన్నగూడెం అనే గ్రామంలో
1615 ఎకరాలకు గాను 1400 ఎకరాలలో తప్పులు తడకలుగా పాసుపుస్తకాలు ఉన్నాయని
తప్పులు సరిచేసే వరకు పాసుపుస్తకాలు తీసుకోమని, సర్వే రాళ్లు వేయనివ్వమని
రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు పథకం
శాశ్వత భూభక్ష పథకం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి కుర్రా నరేంద్ర,
ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక కన్వీనర్ చుండూరు రంగారావు, రైతు సంఘాల
నాయకులు ఎలినేని కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ, రాష్ట్ర తెలుగు రైతు
కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమా వరప్రసాద్, ప్రకాశం,గుంటూరు, కృష్ణ,
పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి రైతు ప్రతినిధులు తదితరులు
పాల్గొన్నారు.