విశాఖపట్నం : వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్
లో భాగంగా గురువారం మెగా క్రికెట్ సంబరం ప్రారంభమైంది. పోర్ట్ మైదానంలో
ప్రారంభమైన ఈ పోటీలకు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు, జనసేన రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ సామాన్యులకు అండగా నిలిచే పాత్రికేయుల సంక్షేమ బాధ్యత ఆయా
ప్రభుత్వాలుదేనన్నారు. జర్నలిస్టులకు తమ వంతు సహకారం నిరంతరం అందిస్తామన్నారు.
తాను కూడా జర్నలిస్టుల కుటుంబ సభ్యుడిగానే ఎప్పుడు భావించుకుంటానన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీను బాబు
మాట్లాడుతూ ఈనెల మూడో తేదీ నుంచి 12 వరకు జర్నలిస్టుల క్రీడలు ఘనంగా
నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇండోర్ స్పోర్ట్స్ ను ముగించుకోవడం
జరిగిందని, 12వ తేదీ వరకు అవుట్ డోర్ పోటీలు జరుగుతాయన్నారు. జర్నలిస్ట్ లు
వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తాము ఎప్పుడు పాటు పడతామన్నారు. ఉపాధ్యక్షులు
ఆర్ నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో మైత్రీ మీడియా అధినేత
అవనాపువిక్రమ్, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమా శంకర్ బాబు, భాస్కర్,
రామ్, వి జే ఎఫ్ కార్యవర్గ సభ్యులు ఇరోతీ ఈశ్వర రావు, డి గిరిబాబు,
ఎమ్మెస్సార్ ప్రసాదు పైల దివాకర్, శేఖర మంత్రి , ప్రజాపిత బ్రహ్మకుమారి బి కే
రామేశ్వరి తదితరులతో పాటు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
దివంగత నేతలకు ఘన నివాళులు : వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యదర్శిగా సుదీర్ఘ
కాలం పాటు సేవలు అందించిన ఎస్ దుర్గారావు, శ్రీదేవి ఛానెల్ అధినేత రామ కృష్ణ
రాజు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన పీవీ చలపతిరావు, విశాఖ
డైరీలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ఆడారి తులసిరావు, మృతి పట్ల
జర్నలిస్టులంతా ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ
సానుభూతిని తెలియజేశారు.