విజయవాడ: ఆర్టీసీ ఎం.డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు చేతుల మీదుగా పేద
విద్యార్ధిని కాలేజీ ఫీజుకి ఆర్ధిక సాయం అందించారు. నిస్సహాయులకు, పేద
పిల్లలకు, దివ్యాంగులకు, తల్లితండ్రుల్ని కోల్పోయిన అభాగ్యులకు సహాయం
అందించడమే ధ్యేయంగా పెట్టుకున్న దీవెన ఫౌండేషన్ ఇప్పటికే పలు కార్యక్రమాలతో
ఎందరికో అండగా నిలుస్తోంది. పోలీస్ డిపార్టుమెంటు లో పలువురు కానిస్టేబుల్స్
బృందం గా ఏర్పడి వారి మిత్రుల సహకారంతో ఈ పనులు నిర్వహిస్తూ “దీవెన ఫౌండేషన్”
నెలకొల్పి ఆపదలో ఉన్న ఎందరికో అండగా నిలుస్తూ సహాయం చేస్తున్నారు. తండ్రిని
కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ‘జ్యోతి’ (పేరు మార్చటమైనది) అనే
విద్యార్ధినికి బీఫార్మసీ మొదటి సంవత్సరo కాలేజ్ ఫీజు నిమిత్తం రూ.15,000
ఆర్ధిక సాయాన్ని దీవెన ఫౌండేషన్ వారి తరపున బుధవారం ఆర్టీసీ ఎం.డి సి.హెచ్.
ద్వారకా తిరుమల రావు ఆర్టీసీ హౌస్ లోని తన ఛాంబర్ లో అందజేశారు. విజయవాడకు
చెందిన ‘జ్యోతి’ తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ‘దీవెన
ఫౌండేషన్’ వారు సదరు ‘జ్యోతి’ కి కాలేజి ఫీజు నిమిత్తం ఆర్ధిక సాయం
అందజేయడానికి నిర్ణయించుకుని ఆర్టీసీ ఎం.డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు
చేతుల మీదుగా అందచేశారు. చదువులో బాగా రాణించి, మంచి భవిష్యత్తును పొందాలని
ఆయన ఆకాంక్షించారు. ఇందుకు గాను ఆ విద్యార్ధిని, ఆమె తల్లి ఇరువురూ దీవెన
ఫౌండేషన్ వారికి, ఆర్టీసీ ఎం.డి సిహెచ్. ద్వారకా తిరుమల రావుకి ప్రత్యేక
ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, కానిస్టేబుల్
బ్రహ్మం, శరత్ కుమార్, రాజు, గోపి తదితరులు పాల్గొన్నారు.