పేర్ల నమోదుకు ప్రత్యేక ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ కేటాయింపు
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
గుంటూరు : యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన
శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో తలపెట్టిన ‘యువ శక్తి’ కార్యక్రమంలో సామాన్య
యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్
నిర్ణయించారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. పార్టీ
కేంద్ర కార్యాలయంలో మనోహర్ వీడియో సందేశంలో మాట్లాడుతూ ‘‘ఉత్తరాంధ్ర ప్రజల
బతుకు వేదన, వలసల నిరోధం, మత్స్యకారుల రోదన, ఉద్దానంలో ఆరోగ్య క్షీణత,
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భవిష్యత్తు ఆలోచనలు, ఇతర సమస్యలతో పాటు స్ఫూర్తివంతమైన
విజయగాధలు అందరికీ తెలిపేలా యువశక్తి వేదిక ఓ గళం కానుంది. ఈ వేదిక నుంచి
యువతరం తమ ఆలోచనలు పంచుకోవచ్చు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో తమ
గుండె గొంతుకను వినిపించవచ్చు. దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ
తేదీలోపు యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. దీనికి పార్టీ తరఫున
ప్రత్యేకమైన ఫోన్ నంబరు, ఈ – మెయిల్ ఐడీ కేటాయించాం. వాయిస్ రికార్డర్ ద్వారా
పని చేసే ఈ ఫోన్ నంబరులో యువతీయువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో
క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి చెప్పవచ్చు… లేదా ఈ – మెయిల్ కు తగిన
వివరాలను పంపవచ్చు. ఆ వివరాలను పరిశీలించి పార్టీ కార్యాలయం నుంచి మీకు తగిన
సమాచారం వస్తుంది. మీరు పేరు, వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నంబరు 080
69932222, ఈ–మెయిల్vrwithjspk@ janasenaparty.org కు వివరాలను పంపాలని కోరారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మనోహర్ విడుదల చేశారు.