ముఖ్యమంత్రిగాజగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారం చేపట్టడం ఖాయం
విజయవాడ : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు
పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి
కి ఘనవిజయాన్ని చేకూర్చాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి
ప్రజాప్రతినిధులు నాయకులు మరియు కార్యకర్తలు ప్రభుత్వానికి సామాన్య ప్రజలకు
మధ్య వారధి లాగా పనిచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని రీజనల్
కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి , మరో రీజినల్
కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి
జోగి రమేష్ అధ్యక్షతన మంగళవారం పెడన నియోజవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమీక్ష
సమావేశం పెడన మార్కెట్ యార్డ్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ
కార్యక్రమంలో పాల్గొన్న రీజినల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ గత
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన రోజు నుండి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి కులం, మతం, ప్రాంతం చూడకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ
పథకాలు అందజేస్తున్నారని, సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలందరూ వీటి పట్ల ఎంతో
సంతోషంగా ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సిపి అధికారం చేపట్టడం
ఖాయమని వెల్లడించారు.
మరో రీజినల్ కోఆర్డినేటర్ , రాజ్యసభ సభ్యులు అయోధ్య రామి రెడ్డి మాట్లాడుతూ
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే సీటు పెడన అని, మీరందరూ ఇంతే కష్టపడితే
పెడన నియోజకవర్గం మెజార్టీలో అగ్రభాగాన ఉంటుందని విచ్చేసిన నాయకులను
ఉద్దేశించి ఆశాభావం వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర మంత్రి
జోగి రమేష్ మాట్లాడుతూ సుమారు 1250 మంది వాలంటీర్లు, వారికి తోడుగా త్వరలో
ఏర్పాటు చేయనున్న గృహ సారధులు మరియు ఇప్పటికే ఒక్కో సచివాలయానికి నియమించిన
ముగ్గురు సమన్వయకర్తలు చొప్పున దాదాపు 4000 మంది జగనన్న సైన్యం ప్రతి
నియోజకవర్గంలో సిద్ధం కానుందని,రాబోయే ఎన్నికల్లో జగనన్న 175 సీట్లు గాను 175
సీట్లు గెలిచి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రకటించారు. తదనంతరం రీజినల్
కోఆర్డినేటర్లు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ మండలాల వారిగా ముఖ్య
నాయకులతో సమావేశమై పార్టీని ఇంకా సంస్థాగతంగా పటిష్టం చేయడానికి సూచనలు,
సలహాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, కేడీసీసీ బ్యాంక్
చైర్మన్ తన్నీరు నాగేశ్వరావు, నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను, బంటుమిల్లి,
పెడన, గూడూరు మరియు పెడన పట్టణ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ
అనుబంధ విభాగాల భాద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.