చంద్రబాబు తన ప్రచార ఆర్భాటం కోసం ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు
డ్రోన్ కెమెరా షూట్ కోసం 8 మందిని చంపేశాడు
చంద్రబాబు పాదం ఒక దిక్కుమాలిన పాదం
చంద్రబాబు వేసే బిస్కెట్లు తినే పెంపుడు కుక్క పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ నడిపేది జనసేన కాదు చంద్రబాబు భజన సేన
158వ రోజు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి
వెలంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ : స్థానిక 51వ డివిజన్ లోని 164వ సచివాలయం పరిధిలో 158వ రోజు
మంగళవారం నాడు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో
ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ
శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఆయా ప్రాంతాలలో పర్యటించి గడప
గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల
వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి
మాట్లాడుతూ ఈ రోజు అంతా కొండా ప్రాంతంలో పర్యటించడం జరిగింది కొంత మెట్లు
డ్రైనేజీ సమస్యలు మా దృష్టికి వచ్చాయి వాటిని త్వరితగతిన అభివృద్ధి పరచమని
అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.అర్హత వున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ
పథకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ది చేస్తున్నామన్నారు.చంద్రబాబు తన ప్రచార
ఆర్భాటం కోసం ప్రజల ప్రాణాలు తీస్తున్నాడన్నారు.డ్రోన్ కెమెరా షూట్ కోసం 8
మందిని చంపేశాడన్నారు.సంక్రాంతి కానుక పేరుతోముగ్గురిని చంపేశాడన్నారు.
చంద్రబాబు పాదం ఒక దిక్కుమాలిన పాదం అన్నారు. చంద్రబాబు వేసే బిస్కెట్లు తినే
పెంపుడు కుక్క పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చక వాళ్ల
పార్టీలో ముఖ్యులు అందరూ ఇతర పార్టీలలో చేరుతున్నారన్నారు.పవన్ కళ్యాణ్
నడిపేది జనసేన కాదు చంద్రబాబు భజన సేన అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 51వ
డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ డివిజన్ నాయకులు కార్యకర్తలు,వివిధ
డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు,డైరెక్టర్లు, పార్టీ
నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలం టీర్లు, నగరపాలక సంస్థ, రెవిన్యు
అధికారులు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.