అమరావతి : జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ‘యువశక్తి’ భారీ బహిరంగ సభతో
తడాఖా చూపుదామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు
కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా
జనవరి 12న ‘యువశక్తి’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ
అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలోని యువత గళం వినిపించేలా ఈ
కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం
వేదికగా యువశక్తి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘యువశక్తి’
గోడపత్రికను పవన్ కల్యాణ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ‘‘స్వామి వివేకానంద వారి స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తమ తడాఖా
చూపించబోతోంది. జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు యువతీ,
యువకులు అందరూ ఆహ్వానితులే. ఉత్తరాంధ్ర వాసుల వలసలు, ఉపాధి లేమి,
విద్యావకాశాలు, వ్యాపార అవకాశాలు, ఇతర సమస్యలపై సమగ్రంగా యువత అభిప్రాయాలు
తెలియజేసేందుకు ఈ యువశక్తి కార్యక్రమం వేదిక కానుంది. ఉత్తరాంధ్ర పరిస్థితులు,
సమస్యలతోపాటు కష్టాల నుంచి విజయాలు సాధించిన వారి గొప్ప స్ఫూర్తిని
ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ కార్యక్రమం ఉంటుంది. ‘మన యువత.. మన భవిత’ అనేదే
యువశక్తి ప్రధాన నినాదం. ఈ ‘యువశక్తి’ భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం’’
అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల
కమిటీ ఛైర్మన్ (పీఏసీ) నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, పొలిట్
బ్యూర్ సభ్యులు అర్హం ఖాన్, ఉపాధ్యక్షుడు బి.మహేందర్రెడ్డి, పార్టీ ముఖ్య
కార్యకర్తలు పాల్గొన్నారు.