గుంటూరు : చంద్రన్న కానుకల పంపిణీ ఘటనలో మృతులకు నష్టపరిహారం చెల్లించాలని
సీఎం జగన్ ఆదేశించారు. మృతల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల
చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. అటు ఘటనకు బాధ్యత వహిస్తూ ఉయ్యూరు
ఫౌండేషన్ మృతుల కుటుంబాలకు భారీ సాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.20 లక్షల
సాయం అందించనున్నట్లు ఉయ్యూరు శ్రీనివాస్ వెల్లడించారు. అటు చంద్రబాబు కూడా
పార్టీ తరుపున మృతుల కుటుంబసభ్యులకు రూ. 5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.చంద్రన్న కానుకల పంపిణీ ఘటనలో మృతులకు.. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకులు భారీ
సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల సాయం అందించనున్నట్లు ఉయ్యూరు
శ్రీనివాస్ వెల్లడించారు. మృతుల కుటుంబసభ్యుల బాగోగులు చూసుకుంటామని,
గాయపడినవారికి వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని ఆయన పేర్కొన్నారు. అటు
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ తరుపున రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
ప్రకటించారు. సీఎం జగన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వెలిబుచ్చారు. మృతుల
కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. టీడీపీ కి చెందిన
మరోనేత కోవెలమూడి రవీంద్ర మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఆర్ధిక సాయం
ప్రకటించారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి రూ.లక్ష ఆర్థిక సాయం
ఇవ్వనున్నట్లు రవీంద్ర వెల్లడించారు.