విజయనగరం : విశాఖ రాజధాని పై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు.
విజయనగరం జిల్లాలోని పైడితల్లి అమ్మవారిని ఆయన ఆదివారం కుటుంబ సమేతంగా
దర్శించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు విశాఖ రాజధాని ఏర్పడుతుందని
అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలో విశాఖలో పరిపాలన రాజధాని
ఏర్పడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలో భోగాపురం విమానాశ్రయం
పనులకు శంకుస్థాపన చేపట్టనున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరాన్ని
పురష్కారించుకుని మంత్రి కుటుంబ సమేతంగా విజయనగరం పైడితల్లి అమ్మవారిని
దర్శించుకున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి ఆయన నివాసం వద్ద నూతన
సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
“ఇంకో రెండు మూడు నెలల్లో విశాఖ రాజధానిగా ఏర్పడుతుంది. అది ప్రభుత్వ విధానం.
ఇక్కడికి అన్ని ప్రభుత్వ కార్యలయాలు, ఇతర కార్యలయాలు తరలివస్తాయి. వచ్చే మూడు
నెలల వరకు భోగాపురం విమానాశ్రయ పనులు ప్రారంభం కానున్నాయ మంత్రి, బొత్స
సత్యనారాయణ పేర్కొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు : టీడీపీ కార్యకర్తలు,
నాయకులు, అభిమానులు వారి నాయకులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు
తెలియజేసుకున్నారు. జిల్లాలోని టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతి రాజుకి పార్టీ
శ్రేణులు, అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్ప గుచ్చాలతో
శుభాకాంక్షలు తెలుపుకున్న రాజకీయ పార్టీలా శ్రేణులు తమ నేతలపై అభిమానాన్ని
చాటుకున్నారు.