విజయవాడ : నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి వైయస్.జగన్ ని వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి వైయస్.జగన్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి అమ్మవారి ప్రసాదములు, వస్త్రం, క్యాలండర్ ను ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ హరి జవహర్లాల్, శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్ధానం కార్య నిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ అందచేశారు. అలాగే రాజ్ భవన్ లో కూడా గవర్నర్ బిస్వబూషన్ హరి చందన్ ను కలిసి అమ్మవారి ప్రసాదం అందించారు.