విజయవాడ : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలోని డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ సభ్యులు, అమ్మవారి ధార్మిక సేవ మండల సభ్యులు, అధికార ప్రతినిధులు, కృష్ణా పెన్నా మహిళా కమిటీ సభ్యులు, కృష్ణాజిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్లు నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 46వ డివిజన్ అధ్యక్షులు షేక్ అమీర్ భాష ఆధ్వర్యంలో పదిమంది యువకులకు కండువాలు కప్పి మహేష్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత ఏడాది విజయవాడ నగరంలోని అనేక సమస్యల మీద పోరాడి విజయం సాధించామని, సమిష్టి పోరాటం వల్ల వైసీపీ అవినీతిపై నిరంతరం పోరాడుగలుగుతున్నామని, వైసీపీ అవినీతి నగరంలో విస్తృతంగా వ్యాప్తి చెందిందని దీని కట్టడి చేయకపోతే నగర అభివృద్ధి శూన్యం అవుతుందని, పార్టీని రాబోయే రోజుల్లో మరింతగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసే యువతరానికి అధిక ప్రాధాన్యం కలిగించే లాగా పార్టీ పదవులు, అలాగే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అడ్రస్ విజయవాడ నగరంలో గల్లంతయ్యే విధంగా పనిచేస్తామని తెలిపారు.
జగనన్న కాలనీలు, సెంటు భూమి పథకంపై కలెక్టర్ ఢిల్లీ రావు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన ప్రకారం క్షేత్రస్థాయిలో నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఇళ్ల నిర్మాణానికి 1,80,000 సరిపోవని పట్టణాలకు దూరంగా ఉన్నాయని, ఇవి నిర్మాణానికి పనికిరావని చెప్పామని, కలెక్టర్ ఢిల్లీ రావు కొత్త సంవత్సరంలో ఈ పథకంలో ఉన్న లోటుపాట్లు వాస్తవాలు తెలియజేశారన్నారు. జగనన్న కాలనీలో దేశంలోనే అతిపెద్ద స్కామ్ పదివేల కోట్ల రూపాయల దోపిడీ అని మహేష్ పేర్కొన్నారు. కలెక్టర్ కి ఈసందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.