2
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ఉప ముఖ్య మంత్రి బూడి ముత్యాల
నాయుడు
వెలగపూడి : రాష్ట్ర ప్రజలకు, పెన్షన్ పొందుతున్న అవ్వా తాతలకు , అక్క
చెల్లెళ్ళకు , దివ్యాంగులకు , అందరు పేదలకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ
రాజ్ శాఖ ఉప ముఖ్య మంత్రి బూడి ముత్యాల నాయుడు 2023 నూతన సంవత్సర శుభా
కాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం పెంచిన పెన్షన్ మొత్తం తో పేదల కళ్ళల్లో
ఆనందం, మోము పై చిరునవ్వు , ఆత్మ గౌరవం.
మన ముఖ్యమంత్రి ఆ రోజు యిచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని క్రమంగా మూడు
వేల వరకు పెంచుకుంటూ పోతామన్న మాటకు కట్టుబడి అందులో భాగంగా మరో మారు ఈ నూతన
సంవత్సర శుభదినాన పింఛను మొత్తాన్ని రూ. 2,500 నుండి రూ. 2,750కు పెంచి జనవరి
2023 నుండి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు శుభ దినం.
ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నవ రత్నాలలో
భాగంగా ముఖ్యమంత్రి పింఛను మొత్తాన్ని రూ. 2,500 నుండి రూ. 2,750కు పెంచి ఈ
జనవరి 1 వ తేది నుండి ఇస్తున్నారు. అంతే కాకుండా 2023 జనవరి నెల నుండి
కొత్తగా 2,31, 463 మందికి పెన్షన్ లు మంజూరు చేసాం. దీనికై 64.69 కోట్లు
అదనంగా ఖర్చు పెడుతున్నాం. వీరితో కలిపి జనవరి నెల నుండి 64.06 లక్షల
పెన్షనర్ లకు రూ.1765 కోట్లు ఖర్చుపెడుతున్నాము. తన సంక్షేమ పాలనలో భాగంగా
రాష్ట్రంలో పేదలకు ముఖ్యమంత్రి పెద్దన్నగా హామీ ఇచ్చిన పెన్షన్ పెంపును అమలు
చేస్తున్నారు. దీనిలో భాగస్వామిగా ముఖ్య మంత్రి నాయకత్వంలో ఉప ముఖ్య
మంత్రిగా గర్వ పడుతున్నాను .
డిసెంబర్ నెల పెన్షన్ మొత్తాలనుజనవరి 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే,
వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా అధికార
యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. నూతన సంవత్సరం జనవరి 1వ
తేదీఆదివారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని
ప్రారంభిస్తారని అన్నారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1,765కోట్ల
రూపాయలను ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు.
సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని
జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ మొత్తాలను ఐదు రోజుల్లో నూరుశాతం
పంపిణీ పూర్తి అయ్యేలా వాలంటీర్లను ఆదేశించామని అన్నారు. పెన్షన్ల పంపిణీ
ప్రక్రియలో 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్
డెవలప్మెంట్ సెక్రటరీలు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 26
జిల్లాల డిఆర్డిఎ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని
పర్యవేక్షిస్తామని తెలిపారు.