శ్రీకాకుళం : నూతన సంవత్సరం ప్రతీ కుటుంబంలోనూ సుఖ సంతోషాలు తీసుకురావాలని
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
ఆకాంక్షించారు. ఆయన ఈమేరకు శనివారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక
ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరిగేలా భగవంతుని
ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో
సుభిక్షంగా ఉండాలని నిండు మనస్సుతో కోరుకుంటున్నానని తెలిపారు. సీఎం వైఎస్
జగన్ తన పాలనలో అందిస్తున్న సంక్షేమంతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, ఇది
కలకాలం ఉండాలంటే ఈ కొత్త సంవత్సరంలో రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే సీఎం
కావాలన్న సత్సంకల్పాన్ని తీసుకుని ముందుకు సాగుదామన్నారు.