విజయవాడ : ప్రొబిషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ ఇప్పించాలని సీసీ ఎల్ ఏ చీఫ్
కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్ ను ఆంధ్ర ప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్
అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాజు శుక్రవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో వీఆర్ఎ నుండి విఆర్డీలు గా ప్రమోషన్ పొందిన సుమారు 3795 మంది
గ్రేడ్ 2 వీఆర్వోలకు ప్రొబిషన్ డిక్లేర్ గురించి చాలాసార్లు తమరు దృష్టికి
తీసుకు రావడం జరిగింది. ఇప్పటికే వారందరికీ సుమారు రెండు సంవత్సరాల ఆరు నెలలు
సర్వీస్ పూర్తయి 15 వేల రూపాయలతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు.
అప్పట్లో ఇచ్చిన 13జీవో ప్రకారం ఒక సంవత్సరంలో సర్వే ట్రైనింగ్ సిపిటి
ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని ఇవ్వడం జరిగింది. కానీ సర్వే ట్రైనింగ్ పెట్టడంలో
అధికారుల జాప్యంవల్ల రెండు సంవత్సరాల తర్వాత సర్వే ట్రైనింగ్
పెట్టడం ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ లో సుమారు
3530 మంది సర్వే ఎగ్జామ్స్ రాయడం జరిగింది. కానీ సర్వే ఎగ్జామ్ రిజల్ట్స్ లో
కేవలం 1800 మందిమాత్రమే పాస్ అవడం జరిగింది. కానీ చాలామంది మేము చాలా బాగా
ఎగ్జామ్స్ రాశాము కానీ పాస్ కాలేదని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎగ్జామ్స్
రిజల్ట్స్ కూడా గతంలో పాస్ మార్క్స్ 40 ఉండగా ఇప్పుడు 50 మార్కులకి పాస్
మార్కులుగా రిజల్ట్స్ ఇవ్వడం వల్ల కూడా చాలామంది ఫెయిల్ అవ్వడం
జరిగింది. ఇప్పటికే వీరు వీఆర్ఎ గా పది, పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేసి
గ్రేడ్ 2 విఆర్డీలు గా జాయిన్ అయ్యి సుమారు రెండున్నర సంవత్సరాలు సర్వీస్
పూర్తి చేసుకుని కేవలం 15000 రూపాయలతో విఆర్డీఓల కుటుంబాలు ఆర్థికంగా,
మానసికంగా ఇబ్బందులు పడుతున్నందున అవసరమైతే 13 జీవోలోని రూల్స్ ను అమిండ్మెంట్
చేసి వీరందరికీ మానవత దృక్పథంతో వీఆర్టీ నుండి వీఆర్వో గ్రేడ్ 2 గా
పనిచేస్తున్న 3795 మందికి వెంటనే ప్రొబిషన్ డిక్లేర్ చేసి పే స్కేల్
ఇప్పించాలని కోరారు.