విజయవాడ : పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 29 వ డివిజన్ 209 వ వార్డు
సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం ఉత్సాహపూరిత
వాతావరణంలో కొనసాగింది. వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ కొంగితల
లక్ష్మీపతి, అధికారులతో కలిసి మధురానగర్ నేతాజీ రోడ్డులో ఎమ్మెల్యే విస్తృతంగా
పర్యటించారు. తొలుత స్థానిక సాయిబాబా మందిరంలో విశేష పూజలు నిర్వహించి
పాదయాత్ర ప్రారంభించారు. 180 గడపలను సందర్శించి, ప్రజల యోగక్షేమాలను అడిగి
తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని అమలు
చేశారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ
శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ
సందర్భంగా స్థానికుల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. సైడ్ కాలువల్లో నీరు
పారేలా ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. కూలిన,
పగుళ్లిచ్చిన సైడ్ డ్రెయిన్ల పున: నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయవలసిందిగా
ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే ఒరిగిన, రహదారి మధ్యలో ఉన్న విద్యుత్
స్తంభాలను తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు. అలాగే వచ్చే వేసవి నాటికి
మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు.
అనంతరం పలువురు అర్జీదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే
చేతులమీదుగా అందజేశారు.
సచివాలయ పరిధిలో రూ. 3.60 కోట్ల సంక్షేమం
నవరత్నాల పథకాల ద్వారా 209వ వార్డు సచివాలయ పరిధిలో రూ. 3.60 కోట్ల
సంక్షేమాన్ని మూడున్నరేళ్లలో అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు.
వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 314 మందికి క్రమం తప్పకుండా ఇంటి
వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 376 మందికి రూ. 48.88
లక్షలు., ఆసరా ద్వారా 250 మందికి రూ. 6.69 లక్షలు., విద్యాదీవెన మరియు వసతి
దీవెన ద్వారా 117 మందికి రూ. 11.70 లక్షలు., చేయూత ద్వారా 121 మందికి రూ.
22.68 లక్షలు., కాపు నేస్తం ద్వారా 46 మందికి రూ. 6.90 లక్షలు., వాహనమిత్ర
ద్వారా 38 మందికి రూ. 3.80 లక్షలు., జగనన్న తోడు ద్వారా 65 మందికి రూ. 6.50
లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. అనంతరం
మీడియాతో మాట్లాడారు.
కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్ జి.సుజనా, నాయకులు
ఎస్.కె.బాబు, కోలా రమేష్ బాబు, కంభం కొండలరావు, సముద్రపు గోవింద్, చీమల
గోవింద్, అక్బర్, అంబటి వెంగయ్య, పూర్ణిమ, బెజ్జం రవి, సుధాకర్, నాగప్రియ,
నాగమణి, విజయలక్ష్మి, సుచన్ బాబు, రాజేష్, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు,
సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.