అర్ధరాత్రి తర్వాత హడావిడి కుదరదు
విజయవాడలో 31 రాత్రి తర్వాత 144 సెక్షన్, సెక్షన్ 30 అమలు
నగర సీపీ కాంతిరానా టాటా
విజయవాడ : నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ శాఖ ఆంక్షలు ప్రకటించింది. ఈ
మేరకు వేడుకలకు సంబంధించి ఆంక్షలను శుక్రవారం నగర సీపీ కాంతిరానా టాటా
ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కేకులు కట్ చేస్తూ హడావిడి
చేయడం లాంటి చర్యలు కుదరవని ఆయన హెచ్చరించారు. బార్ అండ్ రెస్టారెంట్లు
అనుమతి ఇచ్చిన సమయానికి మించి తెరవకూడడదు. అలాగే డీజేలకు అనుమతి తీసుకోవాలి.
ఈవెంట్స్ ఆర్గనైజర్లు, క్లబ్ లు, పబ్ ల నిర్వాహకులు పోలీసు అనుమతి
తీసుకోవాలని, అర్ధరాత్రి 12 గంటల వరకు వేడుకలు నిర్వహించినా జనం మాత్రం
ఒంటిగంటకల్లా ఇళ్లకు చేరుకోవాలని ముందస్తు సూచన చేశారు సీపీ. అలాగే ఫ్లై
ఓవర్లు మూసేస్తామని, రాత్రిళ్లు రోడ్లపై తిరగడం కుదరదని ప్రజలకు తెలిపారు.
విజయవాడలో 31 రాత్రి తర్వాత 144 సెక్షన్, సెక్షన్ 30 అమలులో అవుతుందని ప్రజలకు
తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని,
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర సీపీ కాంతిరానా టాటా
స్పష్టం చేశారు.
గత ఏడాదితో పోల్చితే 13శాతం నేరాలు తగ్గాయి. లోక్ అదాలత్ లలో చాలా కేసులు
సెటిల్ అయ్యాయి. ఈఏడాది 270 చోరీ కేసులు నమోదు అయ్యాయి. 9 కోట్ల రూపాయలు చోరీ
కి గురికా గా 8కోట్ల రూపాయలు రికవరీ చేసాం. 41 మర్డర్ కేసులు నమోదు అయ్యాయి.
గతంతో పోల్చితే 10 శాతం మర్డర్ కేసులు తగ్గాయి. దిశ యాప్ ఇన్స్టాల్ లో చాలా
ముందంజలో ఉన్నాం. 73 ఫోక్సో కేసులు నమోదు అయ్యాయి. మిస్సింగ్ కేసులు నమోదు
అయిన వెంటనే దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నాం. 374 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
రోడ్డు ప్రమాదాలు నియంత్రణ కు మరిన్ని చర్యలు చేపడతాము. 159 సైబర్ కే సులు
నమోదు అయ్యాయి. లోన్ యాప్ బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తే అండగా ఉంటాం.
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో పాటు గంజాయి ని దగ్ధo
చేసాం. అక్రమ మద్యం తరలించే వారిపై ఉక్కుపాదం మోపడం జరిగింది. డ్రంక్ అండ్
డ్రైవ్ చేసే వారిపై కేసులు నమోదు చేసాం. 14 మంది రౌడీ షీటర్స్ ని నగర
బహిష్కరణ చేసాం. శివారు ప్రాంతాల్లో కార్బన్ సెర్చ్ చేస్తున్నాం. బ్లేడ్
బ్యాచ్,గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిపై నిఘా ముమ్మరం చేసాం. టాస్క్ ఫోర్స్
సిబ్బంది పనితీరు బాగుందని నగర సీపీ కాంతిరానా టాటా తెలిపారు.