తిరుమల : తిరుమలలో రేపు, ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ల జారీని తిరుమల తిరుపతి
దేవస్థానం నిలిపివేయనుంది. అలాగే రేపటి నుంచి జనవరి 2 వరకూ శ్రీవాణి ట్రస్ట్
టికెట్ల జారీని సైతం నిలిపివేయనుంది. రేపటి నుంచి జనవరి 3 వరకూ శ్రీవారి
ఆలయంలో ఆర్జిత సేవలను సైతం టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా
తిరుమలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.క్యూఆర్ స్కాన్‌తో వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల కేంద్రాల వివరాలు : వైకుంఠ
ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పది
రోజులకు సంబంధించి 4.50 లక్షలు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లోని 93
ప్రత్యేక కౌంటర్లలో జనవరి 1 నుంచి ఇవ్వనున్నారు. టీటీడీ సాంకేతిక పరిజ్ఞానం
ఉపయోగించి అన్ని కేంద్రాల వద్ద క్యూఆర్ కోడ్ ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు
చేసింది. చరవాణిలో ప్లేస్టోర్ నుంచి క్యూఆర్ స్కానర్‌ను డౌన్లోడ్ చేసుకుని
స్కాన్ చేస్తే అందుబాటులో ఉండే కేంద్రం వివరాలు.. ఎంత దూరంలో ఉంది. తదితరాలు
భక్తులు తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ
ద్వార దర్శనానికి అనుమతిస్తారు.

సర్వదర్శనానికి 24 గంటలు : శ్రీవారి సర్వదర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య
అధికంగా ఉంటోంది. గురువారం సాయంత్రానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా
ధర్మదర్శనానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని
31కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 6షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు వేచి
ఉన్నారు. వీరికి 24 గంటల్లో స్వామివారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది.