గుంటూరు : న్యాయాధికారుల శిక్షణ నిమిత్తం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని
కాజ వద్ద కొత్తగా ఏర్పాటుచేసిన ఏపీ జ్యుడిషియల్ అకాడమీ శుక్రవారం
ప్రారంభంకానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్
ముఖ్య అతిథిగా విచ్చేసి శుక్రవారం అకాడమీని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో
జ్యుడిషియల్ అకాడమీ ప్యాట్రన్ ఇన్ చీఫ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షులు, బోర్డ్
ఆఫ్ గవర్నర్లు(హైకోర్టు న్యాయమూర్తులు) తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం
తర్వాత సీజేఐ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. అక్కడి
ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అన్లైన్ ద్వారా హైకోర్టు
రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్టు ప్రారంభిస్తారు. హైకోర్టు డిజిటలైజేషన్
కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుడతారు. ఆన్లైన్ సర్టిఫైడ్ కాపీల జారీకి
సాఫ్ట్వేర్ అప్లికేషన్, ‘న్యూట్రల్ సైటేషన్ను’ ప్రారంభిస్తారు. ఏపీ
హైకోర్టుకు సంబంధించిన మొదటి వార్షిక నివేదికను విడుదల చేస్తారు. అనంతరం
న్యాయాధికారులను ఉద్దేశించి మాట్లాడతారు.