ఏలేరు–తాండవ అనుసంధాన పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
మెడికల్ కాలేజీ, తాండవ- ఏలేరు లిఫ్టు ఇరిగేషన్ కెనాల్స్ అనుసంధాన
ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం అనకాపల్లి జిల్లా
నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఉ.9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి
10.25 గంటలకు నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు. 11.15 నుంచి 12.50
గంటల వరకు జోగునాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల
నిర్మాణానికి శంకుస్థాపన, తాండవ–ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన
ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం
ప్రసంగిస్తారు. ఆ తర్వాత మ.1.25కు తిరుగు ప్రయాణమై తాడేపల్లి నివాసానికి
చేరుకుంటారు.