న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు విన్నవించిన అంశాల సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌షాకు సీఎం విన్నవించారు. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యు) ఏర్పాటు చేయాల్సిందిగా అమిత్‌షాకు సీఎం విజ్ఞప్తి చేశారు.నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ : “ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కేంద్రంగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ,
గోవా, త్రిపురలలో క్యాంపస్‌లు కూడా స్ధాపించింది. జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్ సైన్స్ మరియు క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తూ ఫోరెన్సిక్ నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉన్న కొరతను సైతం తీరుస్తూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రిమినల్ జస్టిస్ ఇనిస్టిట్యూట్లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది.” ఈ నేపథ్యంలో దక్షిణ భారత దేశంలో ఫోరెన్సిక్
రంగంలో సేవలందించే అటువంటి సంస్థ లేని లోటు, దానిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు.

2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉన్నాయన్న సీఎం. 2014-15కు సంబంధించిన రూ.18,330.45 కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని సీఎం కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును వెంటనే చెల్లించాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేశారు.