బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో జరిగిన
దుర్ఘటన బాధ కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోవడం
విచారకరమన్నారు. రాజకీయ సభలకు నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని,
ఇటువంటి సమయంలో పోలీసులు కూడా భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
రాజకీయంగా విబేధాలు ఉన్నా తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలన్నారు. సభలపై
చర్చించి అవసరమైన భద్రత ఏర్పాట్లు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యతని, అధికార
యంత్రాంగానికి కూడా సభలకు వచ్చే జనాలపై కనీస అంచనా ఉండాలన్నారు. పార్టీ పరంగా
చంద్రబాబు సాయం చేసినా ప్రభుత్వం కూడా స్పందించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని
సోము వీర్రాజు కోరారు.