సింహాద్రి నాధుడు ఆశీస్సులతో కోవిడ్ ప్రభావం లేకుండా చూడాలి
ప్రత్యేక పూజలు నడుమ దేవస్థానము క్యాలెండర్ ఆవిష్కరణ
సింహాచలం : దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ,లోక కళ్యాణార్ధం ప్రతి
ఒక్కరికి మంచి జరగాలని అందుకు ఆ సింహాద్రినాథుడు ఆశీస్సులు అందరికి అన్ని
వేళలా లభించాలని సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు గొడవర్తి
శ్రీనివాసచార్యులు పురోహితులు అలంకార్ కరి సీతారామచార్యులు ఆకాంక్షించారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో గురువారం ఉదయం అర్చక
స్వాముల ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 2023 వార్షిక క్యాలెండర్ ను ధర్మ
కర్తల మండలి సభ్యులు, అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు. సింహాద్రి నాధుడు
అత్యంత మహిమాన్వితులని ఆయన ఆశీస్సులతో నూతన సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని
తాము కోరుకోవడం జరిగిందని ధర్మకర్తల మండల సభ్యులు చెప్పారు. నూతన సంవత్సరంలో
ఉత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని వీరు కోరారు. అలాగే
స్వామి చల్లని చూపుల తో కొవిడ్ గండం లేకుండా రాకుండా చూడాలని స్వామి నీ
వేడుకోవడం జరిగింది అని వీరు చెప్పారు. ఉప ప్రధాన అర్చకులు నరసింహాము
ఆచార్యులు, సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఆలయ
ఇన్స్పెక్టర్ సిరి పురపు కనక రాజు,ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల
శ్రీనుబాబు, దినేష్ రాజు, సంపంగి శ్రీను, శ్రీదేవి, శ్రీదేవి వర్మ ,వంకాయ
నిర్మల, రామ లక్ష్మి, ఏం రాజేశ్వరి, పాత్రుడు, ప్రత్యేక ఆహ్వానితులు
చందు,నరసింహమూర్తి, తది తరులు పాల్గొన్నారు. విజయనగరంలో అశోక్ గజపతి రాజు
చేతుల మీదుగా అప్పన్న నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.