మృతి చెందిన ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి
గాయపడిన వారికి కోటి రూపాయలు చొప్పున టీడీపీ చెల్లించాలి
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా
తిరుమల : నిన్నటి కందుకూరు ఘటన బాధాకరమని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి
ఆర్. కె రోజా పేర్కొన్నారు. పబ్లిసిటీ పిచ్చి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు 8
మంది ప్రాణాలను బలిగొన్నాడన్నారు. ఇరుకైన ప్రదేశంలో సభను పెట్టి ఎక్కువ మంది
ప్రజలు తన సభకు వచ్చినట్లు చూపించేందుకు చంద్రబాబు యత్నించాడని రోజా
దుయ్యబట్టారు. న్యాయస్థానం స్పందించి సుమోటోగా కేసు నమోదు చెయ్యాలన్నారు.
చంద్రబాబుని ఏ-1ముద్దాయిగా చేర్చి హత్యాయత్నం కేసు పెట్టాలన్నారు. 8 మంది
ప్రాణాలను బలిగొనడం చంద్రబాబు రాజకీయంగా చేసిన హత్య అని రోజా పేర్కొన్నారు.
మృతి చెందిన ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు, గాయపడిన వారికి కోటి రూపాయలు
చొప్పున టీడీపీ చెల్లించాలని రోజా పేర్కొన్నారు.