జనసేన అధినేత పవన్ కళ్యాణ్
గుంటూరు : నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్
స్పందించారు. కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుండగా చోటు చేసుకున్న
తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందడం, మరి కొందరు ఆసుపత్రి పాలవడం చాలా
దురదృష్టకరమన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని తెలిపారు.
అటువంటి కార్యకర్తలు ఇలా ప్రమాదం బారినపడి మృతి చెందడం ఎంతో విచారకరమని
అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ
వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆసుపత్రి పాలైన వారు
త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.