గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం
అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు
మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన సీఎం
అమరావతి : కందుకూరు ఘటనపై సీఎం వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
వ్యక్తంచేశారు. మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని
తెలియజేశారు. మరణించివారికి రూ.2 లక్షల చొప్పున , గాయపడ్డ వారికి రూ.50వేల
చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో
ఉన్న ముఖ్యమంత్రి ఆమేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు ఆయా కుటుంబాలకు
ప్రభుత్వం నుంచి అండగానిలుస్తామన్నారు.