గుంటూరు : ఏపీలో క్రైమ్ రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మెరుగైన పోలీసింగ్‌తో
నేరాలు తగ్గించగలిగామన్నారు. లోక్ అదాలత్ ద్వారా పెద్ద ఎత్తున కేసులు
పరిష్కరిస్తున్నాం. 1.08 లక్షల కేసులు పరిష్కరించాం. చోరీ కేసుల్లో రికవరీ
శాతం బాగా పెరిగిందని డీజీపీ పేర్కొన్నారు. ‘గతేడాది 2,84,753 కేసులు నమోదు
కాగా, 2022లో 2,31,359 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2021లో 945 హత్య కేసులు
నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు
2021లో 19,203 జరగగా 2022 లో 18739 ప్రమాదాలు జరిగాయి.
మెరుగైన పోలీసింగ్ తో నేరాల తగ్గుదల : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థ వంతంగా
పని చేయడం వల్లే 2022 లో నేరాలు గణనీయంగా తగ్గాయని , డైరెక్టర్ జనరల్ ఆఫ్
పోలీస్ శ్రీ. రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీడియా కు తెలియచేశారు.
గణనీయంగా నేరాల తరుగుదల : విజబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం,
మహిళా పోలీసు సేవల సమర్థవంత నిర్వహణ, పీడి యాక్ట్ ప్రయోగం, నాటు సారా ఫై
ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయని డీ జీ పీ గారు
తెలియజేసారు. 2020 లో నమోదైన కేసులు 2,92,565 కాగా, 2021 లో 2,84,753 నమోదు
కాగా, 2022లో 2,31,359 కేసులు నమోదైనట్లు తెలిపారు.