విజయవాడ: పెన్షన్ల రద్దుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డి కి మాజీ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలు
నిబంధనలతో ఇష్టారాజ్యంగా పెన్షన్లను తొలగిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. 6
లక్షల మంది పెన్షన్లు రద్దు చేయడం సరికాదని, దివ్యాంగులకు ఆసరాగా ఉండే
పింఛన్లు లాక్కోవద్దని నారా లోకేష్ అన్నారు.