విజయవాడ : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏ.పీలో జరుగుతున్న అభివృద్ధిని
చూసి ఓర్వలేక పోతున్నడని వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ
సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఇష్టారాజ్యంగా
అధికారం చెలాయించిన నారా చంద్రబాబు నాయుడుకు నిజంగానే భయం పట్టుకుంది.
అందుకేనేమో, ‘ఈ ప్రభుత్వానికి భయం లేకుండా పోయింది. ఆ భయాన్ని మనమే
పుట్టించాలి,’ అంటూ మొన్నీమధ్య విజయనగరంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలకు
‘దిశానిర్దేశం’ చేశారని మండిపడ్డారు. టిడిపికి అధికారం పోయిన తరువాత
కార్యకర్తలను అరాచక మార్గంలో నడిపించాడానికి ఇలాంటి సలహాలు చంద్రబాబు
ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కళ్లతో చూడలేని చంద్రబాబు అధికారం కోసం
అలమటించిపోతున్నాడని చెప్పారు. 2014–19 మధ్యకాలంలో ఉత్తరాంధ్రకు అంతులేని
ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే రీతిలో మొసలి
కన్నీరు కారుస్తున్నాడని మండిపడ్డారు. ఏపీ ప్రజల సేవ చేయ్యడం కోసమే ప్రధాని
అయ్యే అవకాశం వచ్చిన ఆ పదవిని వదులుకున్నానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలలో
వాస్తవం లేదని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాని చంద్రబాబుకి గాని
ప్రధాన మంత్రి అయ్యా అవకావం ఎప్పుడు రాలేదని చెప్పారు. ప్రధానితో సీఎం వైయస్
జగన్ సమావేశం ఫలప్రదంగా జరిగిందని తెలిపారు. సీఎం వైయస్ జగన్ కేంద్రం
దృష్టికి అన్ని అంశాలను తీసుకెళ్లారని విజయసాయిరెడ్డి అన్నారు.ఈ మెరకు బుధవారం
నాడు సోషల్ మీడియా స్పందించారు.