సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు
చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి రామకృష్ణ లేఖ రాశారు. 2013 జనవరిలో 10
సంవత్సరాల కాలపరిమితితో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం చేయబడిందని తెలిపారు.
దళిత, గిరిజనుల అభ్యున్నతికి దోహదపడే ఈ చట్టం గడువు 2023 జనవరితో
ముగుస్తుందన్నారు. కాలపరమితి లేకుండా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని
పునరుద్ధరించి, మరింత సామరసవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో
రామకృష్ణ కోరారు.