పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు
విశాఖపట్నం : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోందని
ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. బుధవారం నగరంలో నిర్వహించిన
కాంగ్రెస్ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో రుద్రరాజు పాల్గొని ప్రసంగించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే జరిగిందని తెలిపారు. వైఎస్సార్ ఫౌండేషన్
వేసిన సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏమైందని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం
కార్పొరేట్లకు తొత్తుగా మారిందన్నారు. భూముల అమ్ముకుంటున్నారు తప్ప చేసిందేమీ
లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ దొందూ దొందే అంటూ వ్యాఖ్యలు
చేశారు. ప్రధాని ఏపీకి ఏం చేశారో చెప్పాలని గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.