పూర్తివారాహి వాహనానికి TS13EX 8384 నంబర్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనం ఏపీ
రాజకీయాల్లో రేపిన వివాదం అంతా ఇంతా కాదు. మిలటరీ శకటాన్ని పోలి ఉన్న వారాహిని
సొంతంగా తయారు చేయించుకున్న పవన్ కళ్యాణ్ దీన్ని రోడ్డు పైకి తీసుకురాకముందే
దీన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా దీని రంగు విషయంలో వైసీపీ మాజీ
మంత్రి పేర్నినాని లేవనెత్తిన అభ్యంతరాలతో ఇది కాస్తా వివాదంగా మారింది. అయితే
అన్ని అడ్డంకుల్ని అధిగమించి వారాహి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంది.
పవన్ వారాహి వివాదాలు : పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నికల ప్రచారం కోసం సిద్దం
చేసుకున్న వారాహి వాహనాన్ని ముందే వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా
ప్రత్యర్ధులకు ఈర్ష కలిగేంచేలా పవన్ ఈ భారీ వాహనాన్ని తయారు చేయించుకున్నారు.
సీఎం వాడే వాహనాల కంటే భారీగా, దుర్భేద్యంగా రూపొందించిన ఈ వాహనంపై అధికార
వైసీపీ విమర్శలకు దిగింది. దాని రంగు ఆర్మీ వాహనాల రంగును పోలి ఉందని, నిబంధనల
ప్రకారం ఈ వాహనం రోడ్లపైకి వచ్చేందుకు వీల్లేదని, దీనికి రిజిస్ట్రేషన్ కూడా
జరగదని ఆరోపణలు చేసింది. అయితే ఇవన్నీ ఒట్టివేనని తేలిపోయాయి. పవన్ కళ్యాణ్
తయారు చేయించుకున్న ప్రత్యేక వాహనం వారాహికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ
పూర్తయింది. వాహనానికి రవాణా శాఖ అన్ని అనుమతులు ఉన్నాయని, వాహన బాడీకి
సంబంధించిన సర్టిఫికెట్ పరిశీలించామని,తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్
కమిషనర్ పాపారావు వెల్లడించారు. దీంతో వాహనం రోడ్లపైకి వచ్చేందుకు అడ్డంకులు
లేనట్లు తేలిపోయింది. అక్కడ కొనుగోలు చేసిన వాహనమే కావడంతో తెలంగాణ అధికారులే
దీనికి క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే తెలంగాణలో
రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారాహి వాహనానికి TS13EX 8384 నంబర్
కేటాయించారు. వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ గా నిర్ధారించారు. ఈ మేరకు రవాణాశాఖ
అధికారులు వాహనం ఆర్ సీ మీద దీని వివరాలు ముద్రించినట్లు తెలుస్తోంది. ఈ
వాహనాన్ని ముందుగా తెలంగాణ ఎన్నికలకు వాడతారా లేక ఏపీకి తీసుకొచ్చి
వినియోగిస్తారా తెలియాల్సి ఉంది. అలాగే తెలంగాణాలో రిజిస్టర్ అయిన ఈ వాహనం
ఏపీలో వాడేందుకు కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది.