శ్రీశైలం : ఒకరోజు పర్యటనలో భాగంగా సోమవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలై సాయి సౌందరాజన్ కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయశాఖ కమిషనర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్న, అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్ వెంట భారత పర్యాటక అభివృద్ధి, సంస్కృతి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి, సంస్కృతి శాఖ మంత్రి ఆర్.కె.రోజా, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తదితరులు ఉన్నారు.