అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం సీఎం ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. కాగా,ఈ నెల మొదటివారంలో కూడా సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోడీ అధ్యక్షతన జీ20 సదస్సుకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.