విజయవాడ : మానవాళికి ప్రేమ, కరుణ, దయ పంచిన యేసు క్రీస్తు జననం సందర్భంగా డిసెంబర్ 25 క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ స్థానిక పాత రాజరాజేశ్వరి పేట నందు “జే.యస్ మినిస్ట్రీస్ ” అధినేత, పాస్టర్ తమ్మ మధుసూదన్ రెడ్డి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో చర్చిలో ఘనంగా క్రిస్టమస్ వేడుక జరిపి, దేవదేవుడు యొక్క జన్మదిన వేడుకలు ప్రార్ధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దైవ సందేశకులు యం. డబ్ల్.జోబ్ పాల్గొని నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క అత్యంత విలువైన సందేశాన్ని భక్తులకు బోధన చేశారు. తదుపరి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ 54 డివిజన్ యలకల చలపతిరావు పాల్గొని 2023 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కుల, మత, బేధాలు లేకుండా నిరుపేద కు అండగా ఉండే జె.ఎస్ మినిస్ట్రీస్ ని, వారి సేవల్ని కొనియాడారు. దేవుని యొక్క కృప దీవెనలు ఉన్నవి కాబట్టే ఇంతమంది భక్తులు రావడం జరిగిందని నిరుపేదలకు ఎప్పుడు సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉండే ఈ జే.యస్ మినిస్ట్రీకి ఎప్పుడు కృతజ్ఞతుడైన అండగా ఉంటానని అన్నారు. అనంతరం పాస్టర్ మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలను కార్పొరేటర్ చలపతిరావు, చేతుల మీదుగా అనేక మంది భక్తులకి పేదవారికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.